షారుఖ్ సినిమా.. అనుకున్నంతా అయ్యింది

షారుఖ్ సినిమా.. అనుకున్నంతా అయ్యింది

గత కొన్నేళ్లలో ఏ షారుఖ్ సినిమాకు లేనంత తక్కువ బజ్‌తో రిలీజైన సినిమా 'జబ్ హ్యారీ మెట్ సెజాల్'. మామూలుగా షారుఖ్ సినిమా అంటే ఎంత హంగామా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో 'రయీస్' రిలీజ్ టైంలో హైప్ ఓ రేంజిలో కనిపించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి.

కానీ ఈ చిత్రం 'జబ్ హ్యారీ మెట్ సెజాల్' విడుదలవుతున్న సంగతి కూడా రెగ్యులర్ సినీ గోయర్స్‌కు తెలియదంటే దీని మీద ఎలాంటి బజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతియాజ్ అలీ సినిమాలంటే అవి ఎంటర్టైనింగ్‌గా ఉండవు అన్న క్రమంగా బలపడిపోవడంతో షారుఖ్ లాంటి సూపర్ స్టార్.. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నటించినా 'జబ్ హ్యారీ..'కి బజ్ రాలేదు.

అసలే తక్కువ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. 'జబ్ హ్యారీ..' బోరింగ్ ఫిలిం అని తేల్చేశారు ప్రేక్షకులు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  ఈ సినిమా గురించి నెగెటివ్‌గానే మాట్లాడుతున్నారు. రణబీర్ కపూర్-దీపికా పదుకొనేలను పెట్టి తీసిన 'తమాషా' సినిమానే బ్యాక్ డ్రాప్ మార్చి మళ్లీ చూపించాడని.. సినిమా డెడ్ స్లో అని అంటున్నారు క్రిటిక్స్, ఆడియన్స్.

మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో కూడా కొంతమందికి మాత్రమే ఈ సినిమా కనెక్టవుతుందని అంటున్నారు. క్రిటిక్స్ చాలా వరకు 2కు అటు ఇటుగా రేటింగ్‌తో సరిపెట్టారు. సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేదంటున్నారు అందరూ. నిజానికి ఈ సినిమా మీద షారుఖ్ అభిమానుల్లో ముందు నుంచి పెద్దగా ఆశల్లేవు. ఎప్పుడూ తన సినిమాల్ని గట్టిగా ప్రమోట్ చేసే షారుఖ్ కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీన్ని బట్టే సినిమా తేడా కొట్టేస్తుందనుకున్నారు. ఇప్పుడు అదే జరిగేట్లు కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు