ఈసారీ మహానాడు లేనట్లేనా ?

తెలుగుదేశంపార్టీ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకునే మహానాడు ఈసారి కూడా జరగటంలేదు. కరోనా వైరస్ నేపధ్యంలో పోయిన ఏడాది వర్చువల్ గా మాత్రమే రెండు రోజుల సమావేశాలు నిర్వహించారు. మరి ఇపుడు కూడా అలాగే వర్చువల్ గానే నిర్వహించాలని డిసైడ్ చేశారు. కాకపోతే రెండు రోజుల సమావేశాలా ? లేకపోతే మే 28వ తేదీన మాత్రమే నిర్వహించాలా ? అన్నదే స్పష్టంకాలేదు.

మే 28వ తేదీన టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవటం పార్టీ పెట్టినదగ్గర నుండి ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం జరుపుతునే ఉన్నారు. కాకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అంటే తుపానులు, ఎన్నికల్లాంటి సందర్భాల్లో మాత్రమే మహానాడును నిర్వహించలేకపోయారు.

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మహానాడును నిర్వహించలేదు. మహానాడు నిర్వహణ ఏర్పాట్లకు సరిపడా వ్యవధిలేని కారణంగా అప్పట్లో పార్టీ పండుగ జరపలేదు. ఇక తర్వాత సంవత్సరం కరోనా వైరస్ సమస్య మొదలైపోయింది. అదే సమస్య ఇపుడు కూడా కంటిన్యు అవుతున్న కారణంగా కేవలం వర్చువల్ గా మాత్రమే నిర్వహించాలని స్ధూలంగా డిసైడ్ అయ్యింది. కాకపోతే ఎన్ని రోజులన్నదే తేలాలి.