ఆ హీరోకి దెబ్బ మీద దెబ్బ

ఆ హీరోకి దెబ్బ మీద దెబ్బ

కపూర్ల వారసత్వాన్ని నిలబెడతాడని, అగ్రపథానికి వెళతాడని అనిపించిన రణ్‌భీర్‌ కపూర్‌ ఆరంభంలో తడబడినా తర్వాత కుదురుకున్నాడు. ఒక దశలో వరుసగా హిట్లు సాధించి యువతలో క్రేజ్‌ సంపాదించాడు. అయితే బ్లాక్‌బస్టర్‌ సినిమాలు కాకుండా నటుడిగా ఐడెంటిటీ సాధించాలనే తపనతో అతను చేసిన కొన్ని చిత్రాలు దారుణంగా పల్టీ కొట్టాయి.

ఒక దశలో అతని చిత్రాలకి ప్రింట్ల ఖర్చు కూడా తిరిగి రాని పరిస్థితి తలెత్తింది. చివరకు కరణ్‌ జోహార్‌ కూడా అతనికి యావరేజ్‌ చిత్రాన్నే ఇవ్వగలిగాడు కానీ హిట్‌ మాత్రం అందించలేకపోయాడు. తాజాగా 'జగ్గా జాసూస్‌'తోను రణ్‌భీర్‌ కపూర్‌ మరో ఫ్లాప్‌ మూటగట్టుకున్నాడు. తొలి వారాంతంలో అత్తెసరు వసూళ్లని సాధించిన ఈ చిత్రం ఇక గట్టెక్కడం అసాధ్యం.

బర్ఫీతో తనకి ఒక మరచిపోలేని విజయాన్ని అందించిన అనురాగ్‌ బసు అలాంటి ఫలితాన్ని రిపీట్‌ చేయలేకపోయాడు. చాలా కాలంగా నిర్మాణంలో వున్న ఈ చిత్రం బయ్యర్లతో పాటు నిర్మాతకి కూడా భారీగానే నష్టాలు తెచ్చేలాగుంది. ఈ చిత్రం ఫ్లాప్‌ అయితే పారితోషికం తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించిన రణ్‌భీర్‌ కపూర్‌ ఇక ఆ పని మీద వుండాలి. ప్రతి సినిమాకీ అవధులకి మించి ప్రయోగాలకి పోతోన్న రణ్‌భీర్‌ కపూర్‌ ఇకనైనా వాటిని తగ్గించుకుని సేలబుల్‌ చిత్రాల మీద దృష్టి పెడితే పోయిన తన మార్కెట్‌ తిరిగి సాధించే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు