చరణ్ కు నచ్చిన ఆ రెండు చిన్న సినిమాలు

చరణ్ కు నచ్చిన ఆ రెండు చిన్న సినిమాలు

పెద్ద హీరోలంటే పెద్ద సినిమాలే చూస్తుంటారు.. చిన్న సినిమాల గురించి అసలు పట్టించుకోరు అనుకుంటే పొరబాటే. వాళ్లు కూడా అప్పుడప్పుడూ చిన్న సినిమాలు చూస్తుంటారు. వాటిని ఆస్వాదిస్తుంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అప్పుడప్పుడూ మంచి పేరు తెచ్చుకున్న చిన్న సినిమాలు చూస్తుంటాడట. ఈ మధ్య కాలంలో అతను రెండు చిన్న సినిమాలు చూశాడట. అవి.. పెళ్లిచూపులు, అమీతుమీ అట. అవి తనకు ఎంతగానో నచ్చాయని చరణ్ తెలిపాడు.

''మొన్నే నేను రెండు చిన్న సినిమాలు చూశాను. సారీ చిన్న సినిమాలు అనకూడదేమో. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూశాను. ఇంకో మంచి కామెడీ మూవీ చూశాను. అవే.. పెళ్లిచూపులు, అమీతుమీ. ఈ రెండు సినిమాల్ని ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే.. మా ఫ్యామిలీ అంతా కూర్చుని అంత బాగా సినిమాల్ని ఆస్వాదించడం ఈ మధ్య జరగలేదు. ఆ రెండు సినిమాల దర్శకులు.. నటీనటులు.. టెక్నీషియన్లు అందరికీ నా అభినందనలు'' అంటూ 'దర్శకుడు' ఆడియో వేడుకలో చరణ్ చెప్పడం విశేషం.

ఇక ఈ వేడుకలో సుకుమార్ గురించి చెబుతూ.. అతను తన ఫేవరెట్ డైరెక్టర్ అని, మామూలుగా అయితే తాను ఓ దర్శకుడితో తొలిసారి పని చేసేటపుడు కలిసిపోవడానికి వారం పడుతుందని.. కానీ 'రంగస్థలం'కు పని చేస్తున్నపుడు తొలి షాట్ తీసినపుడే ఆయన విపరీతంగా నచ్చేశాడని.. ఆ సినిమా చాలా బాగా వస్తోందని అన్నాడు చరణ్.

సుకుమార్ దగ్గరున్న ఐడియాలన్నింటితోనూ సినిమాలు చేయాలంటే లైఫ్ టైం సరిపోదని.. ఆయన బేనర్ పెట్టి సినిమాలు నిర్మిస్తూ మంచి పని చేస్తున్నాడని.. ఒక సినిమా ప్రొడక్షన్ చూడటం ఎంత కష్టమో నిర్మాతగా తనకు తెలుసని.. ఐతే సుకమార్ మాత్రం ఆ పని చూసుకుంటూనే 'రంగస్థలం' మీదా ఫోకస్ చేస్తూ క్రియేటివ్‌గా సినిమా తీస్తున్నాడని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు