పూరీకి టైమ్‌ లేదు ఓకే... కానీ

పూరీకి టైమ్‌ లేదు ఓకే... కానీ

డ్రగ్స్‌ కేస్‌లో టాలీవుడ్‌ నుంచి ఇన్‌వాల్వ్‌ అయిన వారిలో పూరి జగన్నాథ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విచిత్రంగా పూరికి క్లోజ్‌ అయిన వారిలోనే ఎక్కువ మందికి నోటీసులు అందాయని మీడియా ప్రచారం చేస్తోంది. చాలా మంది దీనిపై అఫీషియల్‌గా స్పందించినా కానీ పూరి జగన్నాథ్‌ మాత్రం సైలెంట్‌గా వున్నాడు.

అయితే పూరి జగన్నాథ్‌ ఆఫ్‌ ది రికార్డ్‌ కొన్ని బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చాడని, ఇందులో ఇన్‌వాల్వ్‌ అయిన కొందరు ప్రముఖుల పిల్లల్ని వదిలేసి తనని టార్గెట్‌ చేస్తున్నారని అన్నాడని వార్తలొచ్చాయి. అల్లు అరవింద్‌ పెద్ద కొడుకు బాబీ, సురేష్‌బాబు చిన్న కొడుకు అభినవ్‌, మంచు మనోజ్‌ ఇందులో ఇన్‌వాల్వ్‌ అయ్యారని పూరి చెప్పినట్టుగా మీడియాలో ఒక సెక్షన్‌ రిపోర్ట్‌ చేసింది.

డ్రగ్స్‌ కేసు రచ్చ గురించి స్పందించని పూరి దీనికి మాత్రం ఇమ్మీడియట్‌గా రియాక్ట్‌ అయి వదంతులకి ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. తాను ఎవరికీ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని, పైసా వసూల్‌ చిత్రం షూటింగ్‌తో బిజీగా వున్నానని పూరి చెప్పాడు. ఈ మాత్రం క్లారిఫికేషన్‌ మాత్రమే ఇచ్చి పూరి సైలెంట్‌ అయిపోయాడు. డ్రగ్స్‌ వ్యవహారంపై కూడా సింపుల్‌గా ఒక ట్వీట్‌ చేసి వుంటే పోయేదిగా అనేది పబ్లిక్‌ ఒపీనియన్‌.

అయితే నోటీసులు అందుకున్నంత మాత్రాన దానిని ఒక టాపిక్‌ చేయాల్సిన అవసరం లేదు కనుక పూరి సైలెంట్‌గా వుంటున్నాడని, తన స్థాయి ప్రముఖులు దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోతేనే మంచిదని, లేదంటే జనం రేపో మాపో మర్చిపోయే విషయానికి అనవసరంగా ఎక్కువ వెయిట్‌ ఇచ్చి పాపులర్‌ చేసినట్టవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో వున్నారంటూ పేర్లు బయటకి వచ్చిన వారిలో చిన్నా చితకా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తప్ప పేరున్న వారెవరూ స్పందించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు