ఈ ఓవరాక్షన్‌కి మళ్లీ ఎన్టీఆర్‌ రిఫరెన్సా?

ఈ ఓవరాక్షన్‌కి మళ్లీ ఎన్టీఆర్‌ రిఫరెన్సా?

'పటేల్‌ సర్‌' సినిమాలో బ్యాడ్‌ పోలీస్‌గా నటించిన తాన్య హోప్‌ రెచ్చిపోయి ఓవరాక్షన్‌ చేసిందని విమర్శలు వస్తున్నాయి. ఆమె నటనపై సోషల్‌ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. ఈ చిత్రంతో అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు ఆమె స్విమ్‌ సూట్‌లో కూడా కనిపించింది.

తెలుగు తెరపై అరుదుగా కనిపించే స్విమ్‌సూట్‌ సీన్స్‌కి తాను సిద్ధమని తాన్య మొదటి చిత్రంతోనే చాటి చెప్పింది. ఈ చిత్రంలో తన నటన ఎలా వుండాలనే దానికి రిఫరెన్సుగా 'జనతా గ్యారేజ్‌' చూడమని, అందులో ఎన్టీఆర్‌ చేసినట్టుగా చేయాలని దర్శకుడు వాసు ఆమెకి చెప్పాడట.

ఆ చిత్రం చూసి ఎన్టీఆర్‌ని ఫాలో అవడానికి ట్రై చేసానని పటేల్‌ సర్‌ విడుదలకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాన్య చెప్పింది. ఎన్టీఆర్‌ రిఫరెన్స్‌ తీసుకున్నానని చెప్పేసరికి సహజంగానే కొందరికి ఆమె పాత్రపై ఆసక్తి కలిగింది. తీరా ఆ చిత్రంలో ఓవరాక్షన్‌ చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన తాన్య నటన చూసి ఎన్టీఆర్‌ రిఫరెన్స్‌ పెట్టుకుని కూడా ఇలా నటిస్తే, అసలు ఎలా చేయాలనేది దర్శకుడు చెప్పి వుండకపోతే ఇక ఏ విధంగా నటించేదో అని జోకులు వేసుకుంటున్నారు.

ఎంత ఎమోషనల్‌ సీన్‌లో అయినా బ్యాలెన్స్‌డ్‌గా చేసిన జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌ ఎక్కడ, ఈమె పర్‌ఫార్మెన్స్‌ ఎక్కడ? మాట్లాడితే మీనింగ్‌ వుండాలిగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు