ఆమె సెక్సీనే కానీ ఐరెన్‌లెగ్‌ బాబూ!

ఆమె సెక్సీనే కానీ ఐరెన్‌లెగ్‌ బాబూ!

నటిగా పరిచయమై చాలా ఏళ్లవుతున్నా కానీ ఇంకా పూజా హెగ్డేకి హిట్‌ టేస్ట్‌ ఎలాగుంటుందో తెలీలేదు. 'దువ్వాడ జగన్నాథమ్‌' తనకి తొలి హిట్‌ ఇస్తుందనే ఆశతో ఆమె దీని ప్రచారం కోసం చాలా సమయం కేటాయించింది. చివరకు యుఎస్‌ కూడా వెళ్లి వచ్చింది. అయినప్పటికీ 'డిజె' ఫైనల్‌గా యావరేజ్‌గా ఎండ్‌ అవనుంది.

యావరేజ్‌ అంటే ట్రేడ్‌ టెర్మినాలజీ ప్రకారం తక్కువ నష్టాలు అన్నమాట. ఆమె మొదటి సినిమా 'ఒక లైలా కోసం' కూడా యావరేజ్‌గానే ఆడింది. ఆ తర్వాత వచ్చిన ముకుంద డిజాస్టర్‌ అయింది. బాలీవుడ్‌లో హృతిక్‌తో జంట కట్టే అవకాశం రావడంతో 'మొహంజుదారో' సినిమా కోసం మరే చిత్రం ఒప్పుకోకుండా రెండేళ్లు కేటాయించింది కానీ అదీ డిజాస్టర్‌ అయింది.

పైగా అందులోని తన కాస్టూమ్స్‌ వల్ల పూజ కామెడీ అయిపోయింది. 'డిజె' చిత్రంలో చాలా సెక్సీగా వుందంటూ కితాబులు అందుకున్నప్పటికీ పూజపై పడిన ఐరెన్‌లెగ్‌ ముద్రని ఈ చిత్రం చెరపలేకపోయింది. అయినప్పటికీ పూజకి కుర్రకారులో వున్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు ఆమెకి బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారు.

ఆమె మరో ఆలోచన పెట్టుకోకుండా ఈ చిత్రం సైన్‌ చేసేలా కోటి రూపాయల శాలరీ కూడా ఇచ్చారని టాక్‌. క్రేజ్‌తో ఎక్కువ కాలం నెట్టుకురావడం కష్టమే కనుక పూజకి అర్జంటుగా ఒక హిట్టు కావాలి. లేదంటే ఆమె సినిమాలో వుంటే అది ఫ్లాపేననే భావన బలపడిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు