ప్ర‌పంచ ట్విట్ట‌ర్ మ‌హారాణి ఆ సింగ‌ర్‌

ప్ర‌పంచ ట్విట్ట‌ర్ మ‌హారాణి ఆ సింగ‌ర్‌

సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా సంద‌డి చేసే ట్విట్ట‌ర్ లో స‌రికొత్త రికార్డు న‌మోదైంది. అమెరిక‌న్‌ సింగ‌ర్ ఒక‌రు అత్య‌ధిక ఫాలోయ‌ర్ల‌తో రికార్డు స్థాపించారు. ఏకంగా 10 కోట్ల మంది ఫాలోయ‌ర్లు ఆమెకు ఉన్నారు. హాలీవుడ్ సంచలనం, సింగర్ కేటి పెర్రీ ఈ రికార్డు సృష్టించ‌డం విశేషం.

పెర్రీ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య శుక్ర‌వారం నాటికి 10 కోట్ల‌కు చేరింది. ఇంత‌మంది ఫాలోయర్లను సొంతం చేసుకున్న ట్విట్టర్  తొలి యూజర్‌గా ఆమె రికార్డుల‌కెక్కారు. ఈ అరుదైన మార్క్‌ను అభిమానుల వల్లే చేరుకోగలిగానని వారికి ధన్యవాదాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ.  కేటి అగ్రస్థానంలో నిలవగా.. 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్, 85 మిలియన్ ఫాలోయర్లతో మరో పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కాగా పెర్రీ ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్ విట్‌నెస్ తో బాగా బిజీగా ఉంద‌ట‌. 2015లో ఆమె కో డ్యాన్సర్ షార్క్ డ్రెస్ ధరించడంతో అప్పటో హాట్ టాపిక్‌గా నిలిచింది. '96 అవర్', 'బిగ్ బ్రదర్' లాంటి ప్రొగ్రామ్‌లతో 190 దేశాల అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫాలోయర్ల సంఖ్యను అమాంతం పెంచుకుంది. మ‌రోవైపు ఇప్ప‌టికే ఆమె ఫాలోయర్లు ఎక్కువగా ఉండ‌డంతో ప‌లువురు ఇతర సెలబ్రిటీల అభిమానులు గ‌తంలో ఆమె ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేశారు. హ్యాక్ చేయ‌డంతో పాటు అందులో బూతు సందేశాలు, చిత్రాలు పోస్ట్ చేశారు. అప్ప‌ట్లో అది సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు