'బాహుబలి'కి బాబులా వుండాల!

'బాహుబలి'కి బాబులా వుండాల!

అమీర్‌ఖాన్‌తో 'ధూమ్‌ 3' దర్శకుడు తలపెట్టిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌' చిత్రాన్ని కాస్త ఆలస్యంగా లాంఛ్‌ చేయబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్‌ ఓకే అయిపోయిన ఈ చిత్రానికి మరోసారి స్క్రిప్ట్‌ డాక్టరింగ్‌ చేస్తున్నారు. బాహుబలి చిత్రానికి దక్కిన విజయంతో ఈ చిత్రం స్థాయి ఇంకా ఎక్కువ వుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పకడ్బందీ పాత్రలు, కథ, కథనాలు సిద్ధం చేసుకుని, హాలీవుడ్‌కి తీసిపోని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారు. బాహుబలి వెయ్యి కోట్లకి పైగా గ్రాస్‌ వసూలు చేసిన నేపథ్యంలో యష్‌రాజ్‌ సంస్థ ఈ రివిజన్‌కి ఆదేశించింది.

అయిదు వందల కోట్ల బడ్జెట్‌ అయినప్పటికీ కాంప్రమైజ్‌ కారాదని, భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో దీనిని రూపొందించాలని డిసైడ్‌ అయింది. ఈ చిత్రంలో వార్‌ ఎపిసోడ్స్‌ చాలానే వుంటాయని, 'పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌' తరహాలో ఈ చిత్రాన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలని భావిస్తోంది. బాహుబలి చిత్రంతో ఓవర్సీస్‌ మార్కెట్‌ డెప్త్‌ తెలియడంతో ఇంతవరకు ఇండియన్‌ సినిమా క్యాప్చర్‌ చేయని మార్కెట్‌పై ఈ చిత్రం దృష్టి పెడుతోంది.

మొత్తానికి బాహుబలి వల్ల బాలీవుడ్‌ కార్యకలాపాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. అయితే అంతిమ ఫలితం బాహుబలిలా వుంటుందా లేక ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్న చందంగా తయారవుతుందా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు