పవన్‌ 25 నుంచి అద్భుతాలు ఆశించవద్దు

పవన్‌ 25 నుంచి అద్భుతాలు ఆశించవద్దు

పవన్‌కళ్యాణ్‌ ఇరవై అయిదవ చిత్రం కావడంతో త్రివిక్రమ్‌ సినిమాపై మామూలుగా కంటే అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పవన్‌ ఎన్నికలకి సమాయత్తమయ్యే ముందుగా వస్తోన్న క్రేజీ చిత్రమిదే కావడంతో దీనిపై ఫాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో పొలిటికల్‌ డైలాగులుంటాయని, పవన్‌ క్యారెక్టర్‌ సీరియస్‌గా సాగుతుందని, జనసేన సైన్యానికి ఉత్సాహమిచ్చే రీతిన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి.
 
అయితే అలాంటివేమీ వుండవని, ఇది ఫక్తు కమర్షియల్‌ చిత్రమని విశ్వసనీయంగా తెలిసింది. త్రివిక్రమ్‌ రెగ్యులర్‌గా తీసే ఫ్యామిలీ డ్రామాల తరహాలోనే ఇదీ సాగుతుందని, రాజకీయ పరమైన డైలాగులు కానీ, పంచ్‌లు కానీ వుండవని సమాచారం. పవన్‌ పాత్రని కొత్త తరహాలో తీర్చిదిద్దినా ఇది కూడా ఎంటర్‌టైనింగ్‌గానే వుంటుంది తప్ప పవన్‌పై త్రివిక్రమ్‌ ప్రయోగాలేమీ చేయడం లేదని స్పష్టమైంది.

కనుక ఈ చిత్రంలో పవన్‌ ఫలానా పార్టీపై పంచ్‌లేస్తాడు, జాతిని జాగృతం చేసే దేశభక్తుడిగా కనిపిస్తాడని ఎవరైనా చెప్తే నవ్వేసి ఊరుకోండి. ఎందుకంటే వంద కోట్లు పెట్టి పవన్‌కళ్యాణ్‌ పార్టీకి యాడ్‌ ఫిలిం తీసే సరదా ఎవరికీ లేదు కదా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు