బాహుబలితో వచ్చింది సున్నా!

బాహుబలితో వచ్చింది సున్నా!

బాహుబలి సినిమాలో రాణా తెరపై కనిపించినపుడు ఈలలతో థియేటర్లు దద్ధరిల్లాయి. బళ్లాలదేవుడిగా రాణాని అమితంగా ఇష్టపడ్డ ప్రేక్షక లోకం అతడిని తర్వాత కూడా అలాగే ఆదరిస్తుందని, అతను కనిపిస్తే అదే స్థాయిలో ఎక్సయిట్‌ అవుతుందని దగ్గుబాటి ఫ్యామిలీ ఎక్స్‌పెక్ట్‌ చేసింది. కానీ 'ఘాజీ' చిత్రానికి వచ్చిన ఓపెనింగ్‌ కానీ, ఈ చిత్రంలో రాణా తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన కానీ దగ్గుబాటి ఫ్యామిలీ అంచనాలకి తగ్గట్టు లేవు.

ఘాజీలో రాణా ఎంట్రన్స్‌ సీన్‌కి థియేటర్స్‌లో నిల్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక పేరున్న హీరో కనిపించాడనే ఉత్సాహమే ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. దీనిని బట్టి 'బాహుబలి'తో రాణాకి వచ్చిన స్టార్‌డమ్‌ ఆ సినిమా వరకే పరిమితం అనిపిస్తోంది. ప్రభాస్‌ మార్కెట్‌ ఏమో యాభై నుంచి ఒకేసారి వంద కోట్లకి డబుల్‌ అయితే రాణాకి మాత్రం ఎందుకో అదే రీతిన హెల్ప్‌ అవలేదు.

బహుశా రాణా కొద్ది రోజుల పాటు మాస్‌ సినిమాలపై దృష్టి పెడితే మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. గోపీచంద్‌ తరహాలో యాక్షన్‌ కథలపై ఫోకస్‌ పెడితే ఇక ఇమేజ్‌ అంటూ వస్తుందని, అతను ఎంచుకుంటోన్న కథల వల్ల స్టార్‌డమ్‌ వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి రాణాకి స్టార్‌డమ్‌ కావాలా, లేక మంచి నటుడిగా గుర్తుండిపోతే చాలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు