మరీ.. ఇంత కక్కుర్తి ఏంటి సానియా?

మరీ.. ఇంత కక్కుర్తి ఏంటి సానియా?

ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే వారు ఎంత బాధ్యతగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఇమేజ్ వల్ల రాష్ట్ర ఇమేజ్ పెరగాలే కానీ.. తగ్గకూడదు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యవహారం చూస్తే.. ఆమె వల్ల రాష్ట్రానికి పెరిగే ఇమేజ్ సంగతి ఎలా ఉన్నా.. తాజాగా ఆమె వైఖరి కారణంగా రాష్ట్రానికి డ్యామేజ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సేవా పన్నును చెల్లించని వ్యక్తిగా వార్తల్లో నిలవటమే కాదు.. ఆ శాఖాధికారులు సమన్లు ఇచ్చే వరకూ సానియా రియాక్ట్ కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్రాండ్ అంబాసిడర్  హోదాలో తీసుకుంటున్న పారితోషికానికి ఆమె సేవాపన్ను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ శాఖాధికారులు స్పష్టం చేసినా.. సానియా పన్నుచెల్లించలేదు. తెలంగాణ రాష్ట్రబ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు ఆమెకు ఏడాదికి కోటి రూపాయిల చొప్పున పారితోషికాన్ని ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇలాంటి పారితోషికాలకు చట్టబద్ధంగా పదిహేను శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.దీనికి సంబంధించి ఇప్పటికే సానియాకు లేఖల ద్వారా సమాచారం అందించారు. అయినప్పటికీ ఆమె బకాయిలు చెల్లించకపోవటంతో  సర్వీస్ ట్యాక్స్ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 16న వ్యక్తిగతంగా కానీ.. అధికారిక ప్రతినిధిని పంపటం ద్వారా కానీ హైదరాబాద్ లోని సెంట్రల్ ఎక్సైజ్.. కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్ కు హాజరు కావాలని స్పష్టం చేశారు. అయినా.. సేవా పన్ను బకాయిలున్న సానియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు