నాగార్జున సినిమాతో 48 కోట్లు వెనకేసాడు

నాగార్జున సినిమాతో 48 కోట్లు వెనకేసాడు

'ఓం నమో వెంకటేశాయ' ట్రెయిలర్‌ చూస్తే 'అన్నమయ్య' క్రేజ్‌ని మళ్లీ క్యాష్‌ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. అన్నమయ్య వచ్చి ఇరవయ్యేళ్లు దాటినా, మళ్లీ అప్పటి మేకింగ్‌ వేల్యూస్‌, ఆ కాలం గ్రాఫిక్స్‌తోనే దీనిని కూడా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. సినిమాపై ఎలాంటి ఎక్సయిట్‌మెంట్‌ పెంచని ఈ ట్రెయిలర్‌ సంగతి అటుంచితే, ఈ చిత్రంతో నిర్మాత జేబులు మాత్రం బాగా నిండాయనేది ట్రేడ్‌ సమాచారం.

నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని, అన్నమయ్య ఫ్యాక్టర్‌, వెంకటేశ్వరస్వామి భక్తులు వగైరా విషయాలని పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రం హక్కులకి భారీ మొత్తం చెల్లించినట్టు తెలిసింది. కేవలం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారానే ఈ చిత్రానికి ముప్పయ్‌ అయిదు కోట్లకి పైగా బిజినెస్‌ జరిగిందట. ఇక శాటిలైట్‌ హక్కులనేమో ఈటీవీ సంస్థ పన్నెండున్నర కోట్లు పెట్టి తీసేసుకుంది.

అన్నమయ్య టీఆర్పీల గురించి రామోజీకి బాగా తెలుసు కనుక ఫలితం కోసం కూడా చూడకుండా ఈ చిత్రం హక్కులని ఈటీవీ సిద్ధాంతాలకి విరుద్ధంగా భారీ మొత్తం చెల్లించి కైవసం చేసుకున్నారు. సినిమా ఫలితం ఎలాగుంటుందో కానీ ఈ చిత్రం నిర్మాత జేబులైతే ఫుల్లుగా నింపేసింది. రిలీజ్‌ తర్వాత నలభై కోట్ల బిజినెస్‌ చేసినట్టయితే బయ్యర్లకీ సంతోషాన్నిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు