రకుల్ జీవితంలో ఎనిమిదో వింత

రకుల్ జీవితంలో ఎనిమిదో వింత

టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ రైజింగ్ లో ఉంది. ఏ ముహూర్తాన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చేసిందో కానీ.. అప్పట్నుంచీ వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది రకుల్. రామ్ చరణ్ తో వరుస సినిమాలు చేసి కుర్ర హీరోయిన్లు కుళ్లు కునేలా చేసింది.

రకుల్ అందాల ఆరబోతకు అడ్డుచెప్పదు. అటు రెమ్యూనరేషన్ విషయంలోనూ పట్టువిడుపులు ప్రదర్శిస్తుంది. తన పాత్ర విషయంలో పెద్దగా బెట్టు చేయదు. కాస్త ఎడ్జస్ట్ కమ్మన్నా అవుతుంది. అందుకే రకుల్ అంటే అందరికీ హాట్ ఫేవరెట్ హీరోయిన్.

కాజల్ తర్వాత రామ్ చరణ్ రకుల్ తోనే రెండో సినిమా చేశాడంటే.. రకుల్ ప్రవర్తనేంటో మెగాభిమానులకు అర్థమైపోయింది. ఇతర హీరోలకు కూడా రకుల్ ఫేవరెట్టే. రకుల్ డేట్స్ కూడా దొరకని పరిస్థితి ఉందంటే ఆమె ఎంత బిజీగా ఉందో తెలుస్తోంది.

రామ్ చరణ్ తో తొలి సినిమా బ్రూస్ లీ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో రకుల్ కాస్త డిజప్పాయింట్ అయింది. కానీ అనుకోని విధంగా రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ధృవలో కూడా రకుల్ నే తీసుకోవడంతో.. జీవితంలో ఎనిమిదో వింతలాగా ఉందంటోందీ సుందరాంగి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు