ఆస్తుల్లో అధికార పార్టీలకు మించిన టీడీపీ

వ్యక్తులు.. సంస్థల ఆదాయం.. ఆస్తుల గురించిన సమాచారం ఎప్పుడూ ఆస్తికరంగానే ఉంటుంది. మరి.. రాజకీయ పార్టీల సంగతి? ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడే ఈ వివరాలు వెల్లడవుతుంటాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. రికార్డుల్లో.. అధికారికంగా విడుదల చేసిన వివరాలు కావటంతో చర్చించుకోవటంలో అర్థముంది.

దేశంలోని రాజకీయ పార్టీలకు కొదవ లేదు. వందల్లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. ప్రాంతీయ పార్టీల్లో సంపన్న పార్టీల జాబితాను విడుదల చేసిందో సంస్థ. ఆసక్తికరంగా మారిన ఆ వివరాల్ని చూస్తే..

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. విపక్షంలో ఉన్న టీడీపీ.. దేశంలోని సంపన్న పార్టీల్లో ఒకటిగా నిలవటం ఆసక్తికరంగా మారింది. టాప్ ఫైవ్ సంపన్న పార్టీల విషయానికి వస్తే.. ఇందులో అధికార పార్టీలతో పోలిస్తే విపక్షంలో ఉన్న రెండు పార్టీల ఆస్తులు భారీగా ఉన్నట్లుగా వెల్లడైంది. ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ దేశంలో నాలుగో సంపన్న పార్టీగా తేలింది.

దేశంలోని పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా విపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీగా లెక్క తేల్చారు. ఈ పార్టీకి రూ.572 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. రెండో స్థానంలో ఒడిశా అధికారపక్షమైన బీజేపీ రూ.232 కోట్లతో నిలిచింది. మూడ్ో స్థానంలో తమిళనాడు అధికారపక్షమైన అన్నాడీఎంకే నిలిచింది. ఆ పార్టీకి రూ.206 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాలుగో స్థానంలో ఏపీ విపక్షం టీడీపీ రూ.115 కోట్లతో నిలిచింది.

ఆరో స్థానంలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ రూ.152 కోట్ల ఆస్తులు.. ఏపీ అధికారపక్షం వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్సెస్ డిపాజిట్లు ఉన్నట్లుగా తేలింది. ఇదిలా ఉంటే.. తమకు 2018-19 సంవత్సరానికి రూ.18 కోట్ల అప్పులు ఉన్నట్లుగా టీడీపీ వెల్లడించింది. జేడీఎస్ కూడా ఇదే రీతిలో అప్పులు ఉన్నట్లుగా చెప్పాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే బీజేపీ రూ.2904 కోట్ల ఆస్తుల్ని ప్రకటిస్తే.. కాంగ్రెస్ రూ.928 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించింది.