మోడీ హయాంలో ప్రైవేటు పరం చేయాలనుకున్న 35 సంస్థలు ఇవే

వ్యాపారం అన్న తర్వాత నష్టం వస్తుందా? వస్తే.. అసలు వ్యాపారం ఎందుకు చేస్తారు? కొంతకాలం లాభం వచ్చి.. ఆ తర్వాత నష్టం వస్తున్నదంటే ఏదో తేడా ఉన్నట్లేగా? అయినా.. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయటం గొప్ప. దాన్ని అమ్మేయటం ఎంతసేపు? ఆస్తులు కూడబెట్టటంలో ఉన్న కష్టం.. అమ్మటం ఏమంత విషయం కాదు. కానీ.. మోడీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగంలో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయటం కంటే.. ఇప్పటికే ఉన్న సంస్థల్ని అమ్మేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

దేశంలోని 30 ప్రభుత్వ రంగ సంస్థలు గడిచిన ఐదేళ్లుగా నష్టాల్లో నడుస్తున్నాయని.. వాటిని వదిలించుకోవాలని కేంద్రం భావించటం గమనార్హం. ఇదే విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాలా రాజ్యసభకు తెలిపారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు అంటే.. 2016లో కేంద్రం అధీనంలోని 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకొని.. వాటిని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు.

2019-20 నాటికి ఈ సంస్థల కారణంగా కేంద్రానికి వచ్చిన నష్టం రూ.30,131 కోట్లుగా తెలిపారు. 35 సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటివరకు ఎనిమిది సంస్థల్లో ఆ పని పూర్తి అయ్యిందని.. వాటి ద్వారా రూ.66,712 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 2021-22 నాటికి ఇదే తీరులో వ్యవహరించి రూ.1.75లక్షల కోట్లు ఆర్జించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్పారు. నష్టాల్లో నడుస్తున్న కంపెనీల్లో 50,291 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం ఇప్పటికే పెట్టుబడుల్ని ఉపసంహరించిన సంస్థలు ఇదే

  1. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
  2. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
  3. హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్
  4. నేషనల్ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్
  5. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
  6. టీహెచ్ డీసీ ఇండియా లిమిటెడ్
  7. నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
  8. కామరాజ్ పోర్ట్ లిమిటెడ్
    వివాదంలో చిక్కుకున్న లావాదేవీలు
  9. హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్
  10. కర్ణాటక యాంటీ బయాటిక్స్.. ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్

ప్రైవేటు పరం చేయాలని డిసైడ్ చేసిన సంస్థలు

  1. ప్రాజెక్టు అండ్ డెవలప్ మెంట్ ఇండియా లిమిటెడ్
  2. ఇంజనీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్
  3. బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటెడ్
  4. ఫ్లాంట్స్ / యూనిట్స్ ఆఫ్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
    5., సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
  5. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
  6. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్
  7. ఎన్ఎండీసీకి చెందిన నగర్ నార్ స్టీల్ ప్లాంట్
  8. సెయిల్ కు చెందిన అల్లాయ్.. దుర్గాపూర్.. సేలం.. భద్రావతి స్టీల్ ప్లాంట్ యూనిట్లు (4 సంస్థలు)
  9. పవన్ హన్స్ లిమిటెడ్
  10. ఎయిరిండియా.. దాని అనుబంధ.. సంయుక్త భాగస్వామ్య సంస్థలు
  11. హెచ్ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్
  12. ఇండియా మెడిసిన్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్
  13. భారత పర్యాటక సంస్థకు చెందిన వివిధ యూనిట్లు
  14. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్
  15. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
  16. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
  17. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
  18. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
  19. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
  20. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్