మహేష్‌ '1' ఆ సినిమాకి కాపీనా?

మహేష్‌ '1' ఆ సినిమాకి కాపీనా?

సూపర్‌స్టార్‌ మహేష్‌ తాజా చిత్రం '1' (నేనొక్కడినే) చాలా కాలంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ ఇంకా చాలా బ్యాలెన్స్‌ ఉంది. టీజర్‌లోని విజువల్స్‌ చూస్తుంటే ఎందుకు అంత సమయం తీసుకుంటున్నారనేది అర్థమవుతోంది. ఈ చిత్రం తెలుగు తెరపై ఇంతవరకు రాని యాక్షన్‌ సీన్స్‌తో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో ఉంటుందట. ఈ చిత్రంలో మహేష్‌బాబు మూడు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడు. సినిమా విజువల్‌గా మైండ్‌ బ్లాక్‌ చేసేలా ఉంటుందని టాక్‌ ఉంది.

ఇంతకీ ఈ చిత్రం కథేంటి? సుకుమార్‌ అంతలా ఏం తీసేస్తున్నాడు? సినీ వర్గాల్లో వినిపిస్తున్నది నిజమే అయితే కనుక ఇది హాలీవుడ్‌లో వచ్చిన 'బోర్న్‌' సిరీస్‌ ఆధారంగా తెరకెక్కుతోందని అనుకోవాలి. బోర్న్‌ పాత్ర ఆధారంగా హాలీవుడ్‌లో ఇంతవరకు నాలుగు సినిమాలు తెరకెక్కాయి. తన గురించి తాను మర్చిపోయిన ఓ పోలీస్‌ ఏజెంట్‌ తనని తాను శోధించుకుంటూ జరిపే అన్వేషణ ఇతివృత్తంగా బోర్న్‌ సిరీస్‌ తెరకెక్కింది. మహేష్‌ 1 అచ్చంగా దానికి కాపీ కాకపోయినా, దానిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సుకుమార్‌ ఈ కథ రాశాడని వినిపిస్తోంది. నటుడిగా మహేష్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా ఇదని అంటున్నారు. ఈ చిత్రంపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో షూటింగ్‌ డిలే అవుతున్నా కానీ మహేష్‌ ఏమీ అనడం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు