చిన్నోళ్లు చనిపోతే పట్టించుకోరా..?

చిన్నోళ్లు చనిపోతే పట్టించుకోరా..?

తెలుగు ఇండస్ట్రీ ఇక మారదా..? చనిపోయిన తర్వాత అంతా సమానమే అంటారు. కానీ ఇండస్ట్రీలో చావాలన్నా క్రేజ్ ఉండాలేమో..? పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది మరి. పక్కనున్న తమిళ ఇండస్ట్రీలో ఏ చిన్న నటుడు చనిపోయినా.. పెద్దోళ్లంతా దిగొస్తారు. ఆ మధ్య సీనియర్ యాక్టర్ మనోరమ చనిపోతే రజినీ నుంచి కమల్ వరకు అంతా వచ్చారు. కానీ మన దగ్గర మాత్రం అంత మర్యాద కనిపించదు. చచ్చినోళ్ల గురించి మనకెందుకులే.. వాళ్ళేమైనా పెద్దోళ్లా అనుకుని వదిలేస్తుంటారు.

తాజాగా సీనియర్ నటి బండ జ్యోతి కన్నుమూసింది. ఈమె చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉంది. అలాంటి నటి చనిపోతే కనీసం చూడ్డానికి ఒక్కరంటే ఒక్క హీరో గానీ.. దర్శకుడు గానీ రాకపోవడం నిజంగా శోచనీయం. ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది కమెడియన్లు కన్నుమూసారు. ఒక్క బండ జ్యోతికి మాత్రమే కాదు.. చాలా మందికి ఇలాంటి అవమానమే జరిగింది. ధర్మవరపు, ఏవీఎస్, తెలంగాణ శకుంతల, కళ్లు చిదంబరం లాంటి కమెడియన్లు కన్ను మూసినపుడు కూడా స్టార్లు ఎక్కడా కనిపించలేదు. అదేమంటే వాళ్లు చిన్నోళ్లు కదా..! అందుకే అడిగినా అడక్కపోయినా పర్లేదు. ఈ విషయంలో మనకంటే అరవోళ్లు చాలా బెటర్ అనుకోవలేమో. అక్కడ కనీసం సీనియారిటికి గౌరవమిచ్చి చావుకు మర్యాదిస్తారు. కానీ మన దగ్గర మాత్రం వేదంలో అల్లుఅర్జున్ చెప్పినట్లు సరిగ్గా చావాలన్నా పేరుండాలేమో..! ఈ పద్దతులు ఎప్పటికి మారుతాయో మరి..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు