ప్రేక్షకులను వెర్రి వెంగళాయ్‍లను చేస్తోన్న బిగ్‍బాస్‍

బిగ్‍బాస్‍ తెలుగు సీజన్‍ని ఫెయిర్‍గా నడిపించడం చేతకాదని క్రియేటివ్‍ డైరెక్టర్లు గత సీజన్లలోనే నిరూపించుకున్నారు. సెలబ్రిటీలను సైన్‍ అప్‍ చేసుకుని, వాళ్లకు కచ్చితంగా టైటిల్‍ ఇస్తామని మాట ఇవ్వడం, లేదా ఫైనల్‍ ఫైవ్‍కి పంపిస్తామని చెప్పి తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లోను ఆడియన్స్ అండర్‍ డాగ్స్ని ఎంచుకుని వారికి సపోర్ట్ చేసారు.

ఈ సీజన్‍ని బిగ్‍బాస్‍ డైరెక్టర్లు మరింత హీనంగా మార్చేసారు. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా, లేదా నామినేషన్లతో పని లేకుండా ఎవరిని ఎక్కువ రోజులు వుంచాలనేది వాళ్లే డిసైడ్‍ అయి జెన్యూన్‍గా గేమ్‍ ఆడిన దేవి, కుమార్‍ సాయి లాంటి వాళ్లను త్వరగా ఇంటికి పంపించేసారు. జబర్దస్త్ కమెడియన్‍ అవినాష్‍ను ఎక్కువ రోజులు హౌస్‍లో వుంచడానికి చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.

ఈ వారం కూడా అతడిని ఎలిమినేట్‍ కాకుండా చేయడానికి ఏకంగా ఎవిక్షన్‍ ఫ్రీ పాస్‍ ఇచ్చేసారు. అతడు కచ్చితంగా ఎలిమినేట్‍ అయిపోతాడు కనుక ఇలా పాస్‍ ముందే ఇచ్చి అవినాష్‍ వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అతడిని పంపించే ఉద్దేశం లేనపుడు పోల్స్ పెట్టడమెందుకు? జనంతో ఓట్లు వేయించడం ఎందుకు? ఒకవేళ ఎలిమినేట్‍ చేసే ఉద్దేశం లేనపుడు జనాలను ఓట్‍ చేయమని అడగకుండా హౌస్‍మేట్స్ని మాత్రం ఓటింగ్‍ జరుగుతున్నట్టు టెన్షన్‍ పెడితే చాలు కదా? ఇలా జనాన్ని మెప్పించలేకపోయిన వారిని పర్సనల్‍ ప్రామిస్‍ల మీద లాగేట్టు అయితే ఇక ఫెయిర్‍గా గేమ్‍ ఆడేవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇక పీఆర్‍ టీమ్‍ని పెట్టుకుని ఓట్లు వేయించుకుంటోన్న కంటెస్టెంట్లను కూడా బిగ్‍బాస్‍ ఇంతవరకు ఏమీ చేయలేకపోవడం రాబోయే సీజన్లకి బ్యాడ్‍ సిగ్నలే.