లేడీస్‍ని ఎలా కాపాడుకోవాలి బాస్‍?

బిగ్‍బాస్‍ ఇంతకుముందు సీజన్లలో కనీసం ఒక్క లేడీ కంటెస్టెంట్‍ అయినా స్ట్రాంగ్‍గా వుండేది. మొదటి సీజన్లో హరితేజ, రెండవ సీజన్లో గీతా మాధురి, మూడవ సీజన్లో శ్రీముఖి వుండడంతో ఫైనల్‍ ఫైవ్‍లో లేడీస్‍ ప్రెజెన్స్ గురించిన చింత వుండేది కాదు.

కానీ ఈ సీజన్లో ఆడవాళ్లు ఎవరూ స్ట్రాంగ్‍గా లేరు. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పిన టీవీ9 దేవిని మూడవ వారంలోనే ఎలిమినేట్‍ చేసేసారు. ఇక మిగిలిన వారిలో ఎవరికీ బిగ్‍బాస్‍ ఆడే సత్తా వున్నట్టు అనిపించడం లేదు.
ఇప్పటికే వరుసగా నాలుగు వారాలలో నలుగురు లేడీస్‍ బయటకు వచ్చేసారు. ఆదివారం సుజాత కూడా ఎగ్జిట్‍ అవుతోంది. దీంతో వరుసగా అయిదుగురు ఆడాళ్లు బిగ్‍బాస్‍ నుంచి బయటకు వచ్చినట్టవుతుంది.

మోనల్‍ గజ్జర్‍ మ్యానిప్యులేటివ్‍ అని ఆడియన్స్ పసిగట్టడంతో ఆమెకు సరిగా ఓట్లు పడడం లేదు. హారిక ఏమో అభిజీత్‍ వెనుక, అరియానా ఏమో అవినాష్‍ వెంట వుంటూ ఫుటేజీ కోసం చూస్తున్నారు.

యాంకర్‍ లాస్యకి అనుకోని షాకులు తగలడంతో ఆమె బాగా సైలెంట్‍ అయిపోయి, తన ఓట్‍ షేర్‍ బాగా పడిపోయింది. దివి యూత్‍ని ఆకట్టుకున్నా కానీ అమ్మ రాజశేఖర్‍ ప్రభావంలో పడి వెనకబడిపోయింది. ఇప్పుడు హౌస్ లో వున్న వారిలో ఫైనల్‍ ఫైవ్‍ చేరతారని అనిపిస్తోన్న వారిలో అందరూ మగాళ్లే వున్నారు. బిగ్‍బాస్‍ పట్టుబట్టి లేడీస్‍ని కాపాడుకుంటే తప్ప ఫైనల్‍ ఫైవ్‍ కంటే ముందే ఆడాళ్లంతా ఎలిమినేట్‍ అయిపోతారు. నెక్స్ట్ సీజన్‍ కోసం కనీసం ఇద్దరు గట్టి లేడీ కంటెస్టెంట్లయినా వుండాలని ఇప్పట్నుంచే వేటాడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.