ధ‌ర్మాన రాంగ్ స్టెప్ వేసి ఫెయిల్ అయ్యారా…!

ఏ మంత్రికైనా.. ప్ర‌ధాన ల‌క్ష్యం.. త‌ను చూస్తున్న శాఖ‌ను బలోపేతం చేయ‌డం దాని ద్వారా.. ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించ‌డమే. ఈ విష‌యంలో రెండో మాట ఉండ‌దు. అయితే.. ఇప్పుడు మంత్రులు నేరుగా ప్ర‌జా ఉద్య‌మాల‌కు వ‌స్తున్నారు. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. గ‌ళం వినిపిస్తున్నారు. ఇది అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు చేస్తున్నారా? లేక‌.. వారి ఉనికికోసం పాకులాడుతున్న క్ర‌మంలో చేస్తున్న ఉద్య‌మాలో తెలియ‌దు కానీ.. మంత్రులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ముందున్నారు.

మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా.. ఆయ‌న చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా స‌మ‌ర్పిస్తాన‌ని.. ఆయ‌న స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఆయ‌నే తెలిపారు. అయితే.. దీనికి జ‌గ‌న్ వ‌ద్ద‌న్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన‌.. స్థానికంగా.. ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న మేధావి వ‌ర్గాల‌ను ఈ దిశ‌గా న‌డిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేధావుల‌ ఫోర‌మ్‌ను కూడా.. ఏర్పాటు చేశారు. పైకి.. ధ‌ర్మాన ప్ర‌మేయం ఏమీ లేక‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నారు.

అయితే.. దీనిని ఏర్పాటు అయితే.. చేశారు త‌ప్ప‌.. దీనిని బ‌లోపేతం చేయ‌లేక పోయారు. మేధావులు భారీ సంఖ్య‌లో వ‌చ్చి చేర‌తార‌ని.. త‌న‌కు .. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని.. మంత్రిధ‌ర్మాన భావించారు. ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర‌లో మేధావుల‌కు ఢోకాలేదు. వీరి సంఖ్య బాగానే ఉంది. గ‌తంలోనూ.. అనేక ఉద్య‌మాల్లో వారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి ఏపీని ఉంచాల‌ని సాగించిన పోరాటంలో వారే ముందున్నారు. అయితే.. ఇప్పుడు.. మాత్రం మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వారు గ‌ళం వినిపించ‌డం లేదు.

మ‌రి.. వారు విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డం ఇష్టం లేక ముందుకు రావడం లేదో.. లేక‌.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ.. మేధావి వ‌ర్గాలు మాత్రం ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ధ‌ర్మాన వేసిన ఎత్తుగ‌డ పార‌డం లేదు. ఇప్ప‌టికే.. ఏయూ ప్రొఫెస‌ర్లు.. విజ‌య‌న‌గ‌రం క‌ళాశాల అధ్యాప‌కులకు కూడా ధ‌ర్మాన క‌బురు పెట్టారు. కానీ, వారు మాత్రం స్పందించ‌డం లేదు. దీంతో ధ‌ర్మాన‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌తగిలింద‌ని అంటున్నారు స్థానికులు. మ‌రి ఈ వ్యూహానికి బ‌దులుగా ధ‌ర్మాన ఎలాంటి మార్గం ఎంచుకుంటారో చూడాలి.